ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడు ఇంకా రిమాండ్‌లో ఉండటం బాధేస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉందని సోమిరెడ్డి గుర్తు చేసుకున్నారు. అచ్చెన్న మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో పట్టుమని 10లక్షలు అవినీతి చూపలేకపోయినా.. కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపులకు ఓ పరిధి, పరిమితి ఉంటుందని హితువు పలికారు. చివరకు అచ్చెన్న నిర్దోషిగా బయటకు వస్తారని ట్వీట్ చేశారు.
అచ్చెన్న నిర్దోషిగా బయటకు వస్తారు: సోమిరెడ్డి - somireddy on achennanaidu news
అచ్చెన్నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఏ తప్పు చేయకుండా ఆయన ఇంకా రిమాండ్‌లో ఉండటం బాధ కలిగిస్తోందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సోమిరెడ్డి