విజయవాడ సమీపంలోని పోరంకి గ్రామంలో బియ్యం కార్డుదారులకు నగదు అందక ఆదివారం సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అర్హుల జాబితాలో పేరు లేదని, యాప్లో పేరు కనబడటం లేదని సచివాలయ సిబ్బంది డబ్బులు ఇవ్వటం లేదు. లాక్డౌన్ కారణంగా శనివారం నగదు తీసుకోలేకపోయామని... ఇవాళ వస్తే పేర్లు లేవని చెప్పడం దారుణమని కార్డుదారులు గగ్గోలు పెడుతున్నారు. వాలంటీర్లు ఇళ్లకే నగదు తెచ్చి ఇస్తారని సీఎం జగన్ చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదని వాపోతున్నారు. నగదు అందకపోతే ఆకలి దప్పులు తప్పవని వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు 1000 రూపాయలు అందించాలని వారు కోరుతున్నారు.
బియ్యం కార్డులున్నా సాయం అందడం లేదు - పేదలకు ఆర్థిక సాయం
లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు వెయ్యి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే కొన్ని చోట్ల లబ్ధిదారులకు నగదు అందడం లేదు. జాబితాలో పేరు లేదని, యాప్లో పేరు కనబడటం లేదని సచివాలయం సిబ్బంది చెప్పటంతో పేదలు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
financial assistance