గన్నవరంలో 236 కిలోల గంజాయి పట్టివేత - gannavaram
గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ అధికారులు చేసిన తనిఖీలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
గన్నవరంలో 236 కిలోల గంజాయి పట్టివేత
కృష్ణా జిల్లా గన్నవరం పొలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. ట్రాలీలో తరలిస్తున్న 9 లక్షల 44 వేల రూపాయల విలువైన 236 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి నుంచి గుంటూరు తాడేపల్లికి తరలిస్తున్నట్లు గుర్తించారు.