ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"జీవో నెంబర్ 30ను సవరించాలి" - నగరపాలక సంస్థ

నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు సమస్యలను పరిష్కరించాలని... విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్​రావు పాల్గొన్నారు. పురపాలక సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 30ను సవరించి... దాని ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు.

seminar
సదస్సు

By

Published : Dec 29, 2020, 3:25 PM IST

నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... ఏపీ మునిసిపల్ ఉద్యోగుల సంఘం సీఐటీయూ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సదస్సులో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్​రావు పాల్గొన్నారు. పురపాలక సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 30ను సవరించి స్కిల్ల్డ్, సెమి స్కిల్ల్డ్ వేతనాలు చెల్లించాలన్నారు. కరోనా సమయంలో వేతనాల్లో విధించిన 10 శాతం కోతను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్​సోర్స్​ కార్పొరేషన్లను... నగరపాలక సంస్థలకు అనుసంధానం చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్దీకరించి పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లి... పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details