కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు కేశ్యాతండాకు చెందిన భరోతు వెంకటేశ్వరరావు.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన హెడ్ కానిస్టేబుల్ తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాను మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బాధితుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
selfie suicide : పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం... వీడియో వైరల్ - krishna district latest news
కృష్ణా జిల్లా కేశ్యాతండాలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను మానసికంగా వేధిస్తోందని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం
Last Updated : Sep 21, 2021, 2:48 AM IST