ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సర్పంచులు, ఎంపీటీసీలకు మంత్రులు క్షమాపణ చెప్పాలి' - SARPANCHES DEMAND TO RELEASE THE MNREGS FUNDS IN KRISHNADISTRICT

సర్పంచులు, ఎంపీటీసీలకు కృష్ణాజిల్లా మంత్రులు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులతో చేసిన పనులలో ఎంపీటీసీలు అవినీతి చేశారన్న వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకిపాడులో నిర్వహించిన పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సర్పంచులు, ఎంపీటీసీలకు మంత్రులు క్షమాపణ చెప్పాలి:ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

By

Published : Oct 13, 2019, 11:19 PM IST

సర్పంచులు, ఎంపీటీసీలకు మంత్రులు క్షమాపణ చెప్పాలి:ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

కృష్ణా జిల్లా కంకిపాడులో.. పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశం జరిగింది. మాజీ ఎంపీపీ దేవినేని రాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. . మచిలీపట్నంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో... ఉపాధి హామీ నిధులతో చేసిన పనులలో ఎంపీటీసీలు అవినీతి చేశారన్న జిల్లా మంత్రుల వ్యాఖ్యల పట్ల రాజేంద్రప్రసాద్​ తీవ్ర నిరసన తెలిపారు. కష్టపడి పని చేసిన వారిని మంత్రులు కించపరచి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. అంతకుముందు ఉపాధి హామీ బకాయిలను విడుదల చేయాలని... కృష్ణా జిల్లా సర్పంచ్​ల సంఘం చేపట్టిన ర్యాలీలో నేతలు పాల్గొన్నారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details