కృష్ణా జిల్లా గుడివాడలో పురపాలక శాఖ అధికారుల తీరు విమర్శలపాలైంది. పారిశుద్ధ్య కార్మికులకు కోడిగుడ్ల పంపిణీకి అధికారులు నిర్ణయించారు. సమాచారం తెలుసుకున్న కార్మికులంతా.. వాటిని తీసుకునేందుకు కార్యాలయానికి వెళ్లారు. అయితే వారు వ్యక్తిగత దూరం పాటించేలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కారణంగా.. కార్మికులు గుంపులుగానే ఉంటూ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అందించిన కోడిగుడ్లు తీసుకున్నారు. ఈ చర్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యక్తిగత దూరం లేకుంటే.. కరోనా నివారణ ఎలా..? - social distance related news
వ్యక్తిగత దూరం.. కరోనా వ్యాప్తి నివారణకు ఇది ఒక్కటే మార్గం. అయితే కొన్ని చోట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. కృష్ణా జిల్లా గుడివాడలో పారిశుద్ధ్య కార్మికులకు గుడ్లు పంపిణీ చేపట్టే క్రమంలో పురపాలక అధికారులు భౌతిక దూరంపై పట్టంపు లేకపోవడం విమర్శలకు కారణమైంది.
వ్యక్తిగత దూరం లేకుంటే.. కరోనా నివారణ ఎలా..?
TAGGED:
social distance related news