ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవుడికి స్నానం చేయిస్తుండగా... యువకుడు గల్లంతు - machilipatnam

కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్​లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని జాలర్లు కాపాడగా.. మరొకరి ఆచూకీ లభించలేదు.

యువకుని గల్లంతు

By

Published : Jun 7, 2019, 6:53 AM IST

కృష్ణా జిల్లాలో మంగినపూడి బీచ్ లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. జాలర్లు ఒకరిని కాపాడారు. మరొకరి ఆచూకీ లభ్యంకాలేదు. కైకలూరు మండలం కొల్లేటి కోట చెందిన వేముల సాయి గోపాల్, వేముల హేమంత్ కుమార్​గా గుర్తించారు. సాయి గోపాల్‌ను జాలర్లు రక్షించగా... హేమంత్‌ ఆచూకీ తెలియలేదు. గోపాల్​కు మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరో యువకుని కోసం గాలింపు చేపట్టారు. మచిలీపట్నంలోని ఓ బంగారు దుకాణంలో వెండి దేవుడి విగ్రహాలు కొనుగోలు చేసి వాటిని సముద్ర స్నానం చేయించేందుకు మంగినపూడి బీచ్ కు వెళ్ళినట్లు తెలుస్తోంది. స్నానం చేస్తుండగా అలల ధాటికి కొట్టుకుపోయినట్టు జాలర్లు తెలిపారు.

సముద్రంలో యువకుని గల్లంతు

ABOUT THE AUTHOR

...view details