ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోరింది ఇవ్వకుంటే.. తిరుమలకూ బస్సులు ఆపేస్తాం!

50 శాతం ఫిట్​మెంట్​తో వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి సమ్మె నిర్వహించనున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఐకాస నేతలను చర్చలకు ఆహ్వానించారు.

By

Published : Feb 5, 2019, 5:01 PM IST

rtc workers strikes

డిమాండ్ల సాధన కోసం రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. 50 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే సమ్మె తప్పదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ దామోదరరావు హెచ్చరించారు. తిరుమల కొండపైకీ బస్సులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె యత్నాలను విరమింపచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఐకాస నేతలు, యాజమాన్యాన్ని మంత్రి అచ్చెన్నాయుడు చర్చలకు ఆహ్వానించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో నేటి సాయంత్రం 6 గంటలకు మరోసారి చర్చించనున్నారు. కార్మిక ఐకాస నేతలతో పాటు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఉన్నతాధికారులు హాజరవుతారు.

ABOUT THE AUTHOR

...view details