రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత - rtc buses stopped due to janatha curfew
13:07 March 21
రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సుల నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనాపై ప్రధాని పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్నాయి. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని మంత్రి కోరారు. ప్రజలు ఆటోల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురి కావద్దని మంత్రి సూచించారు.
ఇదీ చూడండి: