ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... 15నుంచి సేవలు

దసరా దృష్ట్యా దూరప్రాంత బస్సులు పూర్తిస్థాయిలో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఈడీ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని సూచించారు.

apsrtc
apsrtc

By

Published : Oct 12, 2020, 10:53 PM IST

దసరా పండగ రద్దీ దృష్ట్యా అవసరమైన బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి 28 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో దూర ప్రాంత బస్సు సర్వీసులన్నీ పూర్తి స్థాయిలో రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి అన్ని జిల్లాల ఆర్​ఎంలను ఆదేశించారు.

లాక్​డౌన్​కు ముందు రాష్ట్రంలో పలు ప్రాంతాలకు 2028 దూర ప్రాంత బస్సులు నడిచేవి. ఈ నెల 15 నుంచి వీటన్నింటినీ నడపాలని నిర్దేశించారు. ఈ బస్సులన్నింటిలో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని సూచించారు. ప్రయాణికుల డిమాండ్​ను బట్టి రిజర్వేషన్ చేసుకునే సర్వీసుల సంఖ్య పెంచాలని ఆదేశాల్లో తెలిపారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులును ఏర్పాటు చేయాలని ఆర్​ఎంలకు ఈడీ ఆదేశాలు జారీ చేశారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్దరించిన అనంతరమే తెలంగాణకు బస్సులు నడపాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details