ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దూడను ఢీకొట్టిన బస్సు..రెండు గంటలపాటు నరకయాతన

తల్లి ప్రేమ గొప్పదనాన్ని చాటిచెప్పే సంఘటన ఇది. బస్సు ఢీకొనడంతో నడుం విరిగిన తన దూడని తల్లి ఆవు చూస్తూ.. మూగగా రోదించిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో జరిగింది. తన బిడ్డ పరిస్థితి చూసి తల్లి ఆవు రెండు గంటలపాటు అక్కడే ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు.

By

Published : Aug 22, 2021, 11:58 AM IST

ఆవుదూడను ఢీకొట్టిన బస్సు
ఆవుదూడను ఢీకొట్టిన బస్సు

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం చిన్నగాంధీ బొమ్మవద్ద రోడ్డుపై పడుకున్న ఓ ఆవుదూడను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆవుదూడ నడుం విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. తన బిడ్డ పరిస్థితి చూసి తల్లిఆవు రెండు గంటలపాటు అక్కడే ఉండిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. అయితే వైద్యం చేయించాల్సిన ఆవు యజమాని.. దానిని ఓ వ్యక్తికి 500 రూపాయలకు అమ్మడంతో.. ఆవు యజమానిపై స్థానికులు తిరగబడ్డారు.

దూడ పరిస్థితి చూసి చలించిన తల్లి ఆవు

అటుగా వెళ్తున్న బంగారు షాపు యజమాని గాయపడ్డ దూడని వైద్యం కోసం తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పట్టణంలో రోడ్లపైకి ఆవులను వదిలి.. ప్రజలు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఆవుల యజమానులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి;

ఎయిడెడ్‌ పాఠశాలల స్వాధీనం.. లిఖితపూర్వక అంగీకారం తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details