ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో వరుస దొంగతనాలు.. భయాందోళనలో ప్రజలు - విజయవాడలో వరుస దొంగతనాలు

విజయవాడలో దొంగలు బీభత్సం చేస్తున్నారు. ఒకేరోజు రెండు వేర్వేరుచోట్ల చోరీలు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్​ సమీపంలో రైల్వే ఉద్యోగి ఫ్లాట్​లో దొంగతనం జరిగింది. అంతేకాకుండా కోడూరులోని ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

విజయవాడలో జరిగిన వరుస దొంగతనాలు

By

Published : Nov 22, 2019, 1:06 PM IST

విజయవాడలో జరిగిన వరుస దొంగతనాలు

విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్​లోని ఒక ఫ్లాట్​లో చోరీ జరిగింది. 570డి ఫ్లాట్ రైల్వే లోకో పైలెట్ అజిజ్​కుమార్ తన ఫ్లాట్​కి తాళం వేసి డ్యూటీకి వెళ్ళిన సమయంలో ఫ్లాట్ తాళం పగలకొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.50 వేలు, ఒక డిజిటల్ కెమెరా చోరీకి గురైనట్లు బాధితుడు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో ఘటనలో కోడూరులోని మూడో వార్డు సజ్జా మల్లికార్జునరావు ఇంటి దగ్గర సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో దొంగతనం జరిగింది. అప్రమత్తమైన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొలాల్లో దాక్కుని పోలీసులు దొంగను పట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details