ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు పోయింది...తాటి చెట్టే రహదారైంది!

వరదొస్తే..దేన్నీ ఆపలేం. చెట్టు...పుట్ట...ఊళ్లు...అన్నీటిని వెంట తీసుకొని వెళ్తుంది. కృష్ణాజిల్లాలోని ఓ గ్రామంలో అదే జరిగింది. వరద ప్రవాహానికి రోడ్డు కోతకు గురైంది. మరీ పక్క గ్రామాలకు వెళ్లి రావాలిగా..అందుకే గ్రామస్థులు..తాటిచెట్టును రహదారిగా మలుచుకున్నారు.

road_collapsed_with_floods

By

Published : Aug 20, 2019, 7:46 PM IST

రోడ్డు పోయింది...తాటి చెట్టే రహదారైంది!
కృష్ణాజిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. గ్రామంలోకి వెళ్లే...రోడ్డుపై వరద నీరు ప్రవహించింది. నీటి ప్రవాహ వేగానికి ఎనిమిది అడుగుల లోతు కోతకు గురైంది. దీంతో రాకపోకలకు తాటిచెట్టు దారే దిక్కైంది. ఇటునుంచి అటు.. అటునుంచి ఇటువైపునకు రావాలంటే గ్రామస్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కోతకు గురైన రోడ్డుపై నడవాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు నడవటం అలవాటు లేక అవతలివైపు వెళ్లాలంటే గజగజ వణుకుతున్నారు. గతంలో వరద సంభవించినప్పుడు ఇదే ప్రదేశంలో తూములు ఏర్పాటు చేశారని గ్రామస్థులు తెలిపారు. వరద నీరు ఎక్కువగా రావడంతో తూము దగ్గర రోడ్డు సైతం కోతకు గురైందని వెల్లడించారు. రోడ్డును పరిశీలించిన అధికారులు..నీటి ఉద్ధృతి వలన మరమ్మత్తులు చేయటం ఆలస్యమవుతుందన్నారు. ఇదే ప్రదేశంలో వంతెన నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details