కృష్ణా జిల్లా విజయవాడలోని రామవరప్పాడు కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అజయ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి గుణదల పడవల రేవు కూడలిలోలని బీఆర్టీఎస్ రోడ్డులో స్నేహితుని పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న యువకులు మద్యం తాగి ద్విచక్రవాహనాలతో నగర రోడ్లపై చక్కర్లు కొట్టారు. ఈ క్రమంలో రామవరప్పాడు కూడలి వద్ద అజయ్ నడుపుతోన్న బైక్ అదుపు తప్పి డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అజయ్ అక్కడికక్కడే మృతి చెందగా.. దోమల యశ్వంత్ అనే మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గోస్ట్ రైడర్ పేరుతో అర్ధరాత్రి యువకులు మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. భయాందోళనకు గురి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో బైక్ నడిపాడు.. ప్రాణాలు కోల్పోయాడు - ఢీవైడర్ను ఢీ కొన్న బైకు
కృష్ణా జిల్లా విజయవాడలోని రామవరప్పాడు కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో మితి మీరిన వేగంతో ద్విచక్రవాహనం నడిపిన యువకుడు డివైడర్ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు.
మద్యం మత్తులో డీవైడర్ను ఢీకొన్న ద్విచక్రవాహనదారుడు మృతి