కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని నిడమానూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సునీల్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. విశాఖవైపు వెళుతున్న ట్యాంకర్ లారీని... ద్విచక్రవాహనం వెనకనుంచి ఢీకొట్టడంతో సునీల్ చనిపోగా.. వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
లారీని ఢీకొట్టిన బైక్... యువకుడు మృతి
ట్యాంకర్ లారీని బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గన్నవరం సమీపంలోని నిడమానూరు జాతీయ రహదారిపై జరగ్గా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కృష్ణా జిల్లా నిడమానూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం