తెదేపా నేతలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు - complaint
డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. వైకాపా శ్రేణులపై తెదేపా నేతలు దాడులు చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.
తెదేపా నేతలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు
రాష్ట్రంలో వైకాపా నేతలు, కార్యకర్తలపై తెలుగుదేశం నేతలు దాడులు చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి...తెలుగుదేశం నేతలపై ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతల గురించి వస్తున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. తెదేపా శ్రేణులు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని... తెదేపా అధినేత చంద్రబాబు వారికి సూచించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.