ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫొని తుపాను ఎఫెక్ట్... రైస్ మిల్లులు ఫుల్

కృష్ణా జిల్లాలోని రైస్ మిల్లులు ధాన్యపు బస్తాలతో నిండిపోయాయి. రైతులందరు ఒకేసారి ధాన్యం విక్రయించడానికి తీసుకురావడంతో... గిడ్డంగులు, రైస్ మిల్లులు, మార్కెట్ యార్డులు ధాన్యం బస్తాలతో దర్శనమిస్తున్నాయి.

ఫొని తుపాను ఎఫెక్ట్... రైస్ మిల్లులు ఫుల్

By

Published : May 2, 2019, 7:37 AM IST

ఫొని తుపాను ఎఫెక్ట్... రైస్ మిల్లులు ఫుల్

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో... ముంచుకొస్తోన్న ''ఫొని'' తుపాను రైతన్నల గుండెల్లో గుబులు రేపుతోంది. వీలైనంత త్వరగా పంట కోసి ధాన్యం విక్రయించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. వర్షానికి తడవకుండా... ధాన్యాన్ని సమీపంలోని మార్కెట్ యార్డులకు తరలించి విక్రయిస్తున్నారు. రైతులందరూ ఒకేసారి ధాన్యం తీసుకురావడంతో... కృష్ణా జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డులు ధాన్యం బస్తాలతో నిండిపోయాయి. అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా... ఎక్కువగా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ముమ్మరం చేశారు. ఒకేసారి పెద్దఎత్తున ధాన్యం రావడంతో గిడ్డంగులు సరిపోవడం లేదు. సమీపంలోని రైస్ మిల్లులకు పంపుతున్నారు. ధాన్యపు బస్తాల రాశులతో జిల్లాలోని రైస్ మిల్లులు నిండిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details