సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగులోకి వచ్చిన నకిలీ చలానాల కుంభకోణంలో శాఖాపరమైన విచారణ జరుగుతోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల డాక్యుమెంట్లను పరిశీలించినట్లు పేర్కొన్నారు. వీటి వల్ల మొత్తం రూ. 5 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని అంచనావేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే 10 క్రిమినల్ కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో 9 జిల్లాలకు గాను.. కృష్ణా, కడప జిల్లాల్లో ఎక్కువ కేసులు ఉన్నాయని, ఇప్పటి వరకు రూ. 1.37 కోట్లు.. అంటే మెుత్తం కుంభకోణంలో 25 శాతం సొత్తును రికవరీ చేసినట్లు రజత్ భార్గవ్ తెలిపారు. వీరిపై కఠిన చర్యల విషయంలో ఏమాత్రం వెనుకడుగు ఉండదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మొత్తం 10 మందిపై ఆరోపణలు ఉండగా.. ఆరుగురు సబ్ రిజిసస్ట్రార్లను ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు. 770 డాక్యుమెట్లలో భారీ మోసాలు జరిగినట్లు గుర్తించినచ్లు వివరించారు.