ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపాకే బీసీల మద్దతు : ఆర్​.కృష్ణయ్య - fire

బీసీలను వాడుకొని వదలి పెట్టిన తెదేపాపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య మండిపడ్డారు. బీసీలపై చిత్తశుద్ధిని చూపించిన వైకాపాకు ఈ ఎన్నికల్లో మద్దతిస్తామని తెలిపారు.

తెదేపా మండిపడ్డ బీసీ సంఘం అధ్యక్షులు

By

Published : Mar 31, 2019, 10:31 PM IST

తెదేపా మండిపడ్డ బీసీ సంఘం అధ్యక్షులు
బీసీలను వాడుకొని వదలి పెట్టిన తెదేపాపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య మండిపడ్డారు. తెదేపాకు అండగా నిలిచిన బీసీలను ఎన్నో రకాలుగా అవమానించారన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు కుటిల రాజకీయాలకు విసుగు చెందామన్నారు. బీసీలపై నిజమైన చిత్తశుద్ధిని చూపించిన వైకాపాఅధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి తమకు సంతృప్తి కలుగజేసిందని అన్నారు. అందుకేఈ సార్వత్రిక ఎన్నికలలో బీసీల మద్దతు వైకాపాకు ఇస్తున్నామని తెలిపారు. బీసీలను ఎన్నో రకాలుగా వేధింపులకు గురిచేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడిస్తామని తెలిపారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details