ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. 'ఓ బేబీ' సినిమా విజయవంతం కావటంతో అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని వెల్లడించారు. శాకంబరి ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ పండితులు నటకిరీటికు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దుర్గమ్మను దర్శించుకున్న నటకిరీటి - కనకదుర్గమ్మ
ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 'ఓ బేబి' సినిమా విజయవంతమైనందుకు...అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చానన్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్