'రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల పెంపు తాత్కాలికం' - రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల పెంపు తాత్కాలికం
రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ల పెంపు తాత్కాలికమని డీఆర్‌ఎం శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రయాణీకుల సౌకర్యార్థమే ఈ నిర్ణయమని వివరించారు.
railway-platform-tickets-in-vijayawada
రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ల పెంపు తాత్కాలికమే అని విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్‌ఎం శ్రీనివాస్ స్పష్టం చేశారు. దసరా రద్దీ దృష్ట్యా... ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచామని తెలిపారు. మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా... గత 15 రోజులుగా నిర్వహిస్తున్న స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం అంటూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.
TAGGED:
ప్లాట్‌ఫామ్ టికెట్లు