ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలిరోజే రైల్వే ప్రయాణికులకు విజయవాడలో ఇక్కట్లు

రాష్ట్రంలో రైళ్ల రాకపోకలు ప్రారంభం కాగా...విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ పెరిగి భౌతిక దూరం నిబంధనకు విఘాతం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడంలో అధికారుల వైఫల్యంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ముందస్తు ప్రణాళిక లేదని విమర్శించారు.

railway passengers problems in vijayawada
విజయవాడ రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల తోపులాట

By

Published : Jun 2, 2020, 4:06 AM IST

విజయవాడ రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల తోపులాట

దేశవ్యాప్తంగా రైళ్లు ప్రారంభమైన మెుదటి రోజే... విజయవాడ రైల్వే స్టేషన్​లో గందరగోళం నెలకొంది. విజయవాడ రైల్వే స్టేషన్​కు రాత్రి 7:30గంటలకు రావాల్సిన గోల్కొండ ఎక్స్ ప్రెస్ రాత్రి 8.15గంటలకు వచ్చింది. వందల మంది ప్రయాణికులు దిగారు. వీళ్లందరికీ కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి పంపించేందుకు అధికారులు ప్రయత్నించారు. ప్లాట్ ఫాం- 1పై ఉన్న విశ్రాంతి గది వద్దకు తీసుకెళ్లి అందరినీ క్యూలైన్లలో ఉంచారు. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి వారిలో అనుమానితులకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయాలని భావించారు. అందుకు సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల.. అప్పటికే సుదీర్ఘ ప్రయాణం చేసిన వాళ్లందరు విసుగు చెంది సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మందిని క్యూలైన్​లో నిలబెట్టి పరీక్షలు ఎప్పుడు చేస్తారంటూ మండిపడ్డారు. ఇలాగైతే పరీక్షలు చేసినట్టే అంటూ అడ్డుగా పెట్టిన కుర్చీలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. చేసేదేం లేక అధికారులు చూస్తూ ఉండిపోయారు.

ABOUT THE AUTHOR

...view details