ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుర్గ గుడిలో రాహుకేతు పూజలు

విజయవాడ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు పూజలు ప్రారంభించారు. కలెక్టర్ లక్ష్మికాంతం దంపతులు, ఈవో కోటేశ్వరమ్మ తొలి పూజలు చేశారు

By

Published : Feb 6, 2019, 6:07 PM IST

దుర్గ గుడిలో రాహుకేతు పూజలు

దుర్గ గుడిలో రాహుకేతు పూజలు
విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నుంచి నూతన ఆర్జిత సేవలుగా రాహుకేతు పూజలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా కలెక్టర్​ లక్ష్మికాంతం, నగర పాలక పోలీస్​ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఈవో కోటేశ్వరమ్మ తొలి పూజ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు వినాయక పూజతో కార్యక్రమం మొదలైంది. రాహుకేతువుల విగ్రహాలకు పంచలోహ శోదన నిమిత్తం యాగం నిర్వహించారు.
పూజా రుసుముగా 1116 రూపాయలు తీసుకుంటారు. ఒక్క టిక్కెట్​కు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు రోజుల్లో ఈ ఆర్జిత సేవను ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత భక్తుల స్పందన ఆధారంగా రాహుకాలంలో ప్రతిరోజు నటరాజ స్వామి దేవాలయం పక్కన ఈ పూజలు నిర్వహిస్తామని ఈవో కోటేశ్వరమ్మ అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details