జగ్గయ్యపేటలో విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పర్యటన విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ జగ్గయ్యపేటలో పర్యటించారు. మాజీ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఆయనకు కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర సరిహద్దు గరికాపాడు నుంచి భారీగా అభిమానుల మధ్య ర్యాలీగా తరలివచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ రూపురేఖలు మార్చి.. యువతకు ఉపాధి కల్పించడమే తన మెుదటి ప్రాధాన్యత అని వరప్రసాద్ అన్నారు. ర్యాలీలోని కొన్ని వాహనాలకు అనుమతి లేదంటూ చిల్లకల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.