పులిచింతల డ్యాంకు తొలిసారి 45 టీఎంసీల నీరు చేరి నిండుకుండాలా కనిపిస్తుంది. 2014లో ప్రారంభోత్సవం తరువాత పూర్తి సామర్ధ్యం మేర నీటి నిల్వ సాధ్యమైంది. గత నెల వరదల సమయంలో 9లక్షల క్యూసెక్కుల నీటిని వదిలి, డ్యాంలో 39 టీఎంసీల వరకు నీటి నిల్వ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన అనంతరం నీటి విడుదల తగ్గించి క్రమంగా నీటి నిల్వ పెంచారు. ప్రస్తుతం 22వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం జలాశయానికి వస్తుండగా, 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్ పూర్తి సామర్ధ్యం నిండిన నేపథ్యంలో వచ్చిన నీటిని వచ్చినట్లు వదలనున్నారు.
నిండుకుండలా పులిచింతల..తొలిసారి పూర్తిస్థాయి నీటిమట్టం - pulichintala project
2014లో ప్రారంభించిన తరువాత తొలిసారిగా కృష్ణాజిల్లాలో ఉన్న పులిచింతల జలాశయానికి 45 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం డ్యాం పూర్తి సామర్థ్యంతో ఉందని అధికారులు తెలిపారు.
ఐదేళ్లకు పూర్తి స్థాయిలో పులిచింతల జలాశయం
TAGGED:
pulichintala project