ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన - protest in front of police station news

కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారామపురం సర్పంచ్​ లింగమనేని సత్యవాణి, భర్త కిషోర్, వారి అనుచరులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమపై కక్షతో అక్రమ కేసులు బనాయించి.. నూజివీడు రూరల్ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్ వేధిస్తున్నారని ఆరోపించారు.

protest in front of police station
పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన

By

Published : Mar 30, 2021, 3:24 PM IST

పోలీస్​స్టేషన్​ ఎదుట ఆందోళన

కృష్ణా జిల్లా నూజివీడు రూరల్ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సీతారామపురం సర్పంచ్ లింగమనేని సత్యవాణి ఆరోపించారు. తన భర్త కిషోర్, వారి అనుచరులతో కలిసి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఇప్పటి వరకు గ్రామం ఐకమత్యంతో ఉందని.. ఎస్సై చేష్టలతో ఇప్పుడు అట్టుడుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారాలని, స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్​కు చెందిన ఎస్టేట్​కు వెళ్లాలని ఎస్సై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు.

చదువుకునే విద్యార్థులను కూడా వదలకుండా కేసులో ఇరికించడానికి ప్రయత్నించటం దారుణమన్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదులకు స్పందించని ఎస్సై... గ్రామంపై దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామ ప్రజలంతా కదలి వచ్చామని.. ఇక్కడే అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఐ వెంకటనారాయణ ఆందోళనకారులతో సంప్రదింపులు జరిపారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాక.. తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్లు సర్పంచ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details