స్ట్రాటజిక్ సేల్ పేరిట విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రైవేటీకరణను నిరసిస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మైన్స్ యూనిట్లో అఖిలపక్షం అధ్వర్యంలో.. నాయకులు ఆందోళన చేపట్టారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే మరింత ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.