అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం... నేడు కంకర రాళ్ల రోడ్డుగా తలపిస్తోంది. గల్లీ క్రికెట్ ఆడుకునేందుకూ పనికి రానిదిగా మారిపొయిందని క్రీడాభిమానులు ఆవేదన చెందుతున్నారు. 25 వేల మంది వీక్షించేలా విశాలమైన క్రీడా మైదానం... నేడు కళావిహీనంగా వెలవెల బోతుంది. హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయం కోసం... 2014 లో టాలీవుడ్ తారలు నిర్వహించిన స్టార్ క్రికెట్ మ్యాచ్ (టీ-20 మ్యాచ్) చరిత్ర కలిగిన స్టేడియం... నేడు నిరుపయోగంగా మారడం శోచనీయమని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మ్యాచ్‌లకే ఆతిథ్యమిచ్చిన ఆ స్టేడియానికి...ఇప్పుడేమైంది?
ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం....నేడు గల్లీ మ్యాచ్‌లు ఆడేందుకు పనికొచ్చేలా లేదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కళావిహీనంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
TAGGED:
హుద్‌హుద్ తుపాను