నాగార్జున సాగర్ నుంచి కృష్ణమ్మ ఉరుకులు పరుగులతో వడివడిగా దిగువకు పరుగెడుతుండటంతో....ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో వచ్చిన నీరు వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.ఎన్నో ఏళ్ల తర్వాత కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో...నీటి అందాలు ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్దఎత్తున నగరవాసులు బ్యారేజీ వద్దకు చేరుకుంటున్నారు.సందర్శకుల రాకతో బ్యారేజీ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.
ప్రకాశం బ్యారేజీకి జలకళ - beauty
మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన కృష్ణమ్మ... ఇప్పుడు హొయలతో పరవళ్లు తొక్కుతోంది. జలాశయాలన్నింటినీ నింపుకుంటూ సముద్రుడి చెంత చేరేందుకు ఉరకలు వేస్తోంది. ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాలట్లేదు.
prakasam-barrage-beauty
కృష్ణమ్మ జలసవ్వడులను వింటూ....సుందరమైన జల దృశ్యాలను మనసారా ఆస్వాదించేందుకు నగర వాసులు బ్యారేజీ వద్దకు తరలివస్తున్నారు.బిరబిరా పరుగులు తీసే కృష్ణమ్మను చూసి ఎంతకాలమయ్యిందోనంటూ నగరవాసులు పులకించిపోతున్నారు.వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో...తాడేపల్లి వైపున ఉన్న శివాలయంలోకి నీరు చేరింది.శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము ఆకృతి తప్ప ఆలయం ఇంకేమీ కనిపించనంతగా నీరు చుట్టుముట్టింది.