పార్లమెంట్ లో బలం ఉందని ట్రిపుల్ తలాక్,ఆర్టికల్370వంటి ప్రజా వ్యతిరేక చట్ట సవరణలకు భాజపా పాల్పడుతుందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ తెలిపారు.ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులను భాజపా ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు.మహిళలు,ఆదివాసీలు,కార్మికులకు రక్షణ లేకుండా చేస్తున్న చట్ట సవరణలను తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.పౌర హక్కులపై విజయవాడలో1వ తారీఖున జరిగే సదస్సులో ఈ అంశాలపై కూలంకుశంగా చర్చిస్తామని,ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు,మానవ హక్కుల పరిరక్షణ సంఘాల వ్కక్తలు ఈ సమావేశానికి హజరవుతారని చంద్రశేఖర్ తెలిపారు.
హక్కులను భాజపా కాలరాస్తోంది:పౌర హక్కుల సంఘం - meeting
ప్రజావ్యతిరేక చట్ట సవరణలు,ప్రమాదంలో హక్కులు అంశంపై సెప్టెంబరు 1న విజయవాడలో సదస్సు జరగునుంది.
సదస్సు