కృష్ణా జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ పోషణ పురస్కారం-2019 లభించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అభినందించారు. శాలువాతో సత్కరించి మొక్కలు బహూకరించారు. స్త్రీ, శిశుసంక్షేమ శాఖ పీడీ కృష్ణకుమారిని సైతం సీపీ సత్కరించారు. శుక్రవారం దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా కలెక్టర్ ఇంతియాజ్ పురస్కారం అందుకోగా 2018-19 ఏడాదికి సంబంధించి పోషకాహార లోప నివారణకు జిల్లాలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వటంతో జిల్లాకు ఈ పురస్కారం వరించింది.
కలెక్టర్‌ను అభినందించిన సీపీ ద్వారకా తిరుమలరావు - dwaraka tirumala rao
కృష్ణా జిల్లాకు కేంద్రప్రభుత్వం నుంచి జాతీయ పోషణ పురస్కారం లభించటంపై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు కలెక్టర్ ఇంతియాజ్‌ను అభినందించారు.
కలెక్టర్‌కు అభినందనలు