poor people: ప్రతీ ఒక్కరికీ తిండి, బట్ట, ఇల్లు ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి అందక చాలా మంది ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. కొంతమంది సుమారు రెండు కాదు దశాబ్దాలుగా కృష్ణానది ఒడ్డు వద్దే చిన్న గుడిసెలు వేసుకుని దుర్భరంగా జీవిస్తున్నారు. పొట్ట నింపుకోటానికి గ్రామాల్లో యాచించే పరిస్థితి వీరిది.
poor people:మాకు ఏ 'గుర్తింపు' లేదు.. మేము మనుషులమే..! - krishan district latest updates
poor people:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరికాన్ని రూపుమాపేందుకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో పేదలకు అందడం లేదు. సుమారు యాబై యేళ్లపాటు కృష్ణానది ఒడ్డున గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వీరు నిరుపేదలు. గ్రామాల్లో యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. కనీసం ఒక్క గుర్తింపు పత్రాలు కూడా లేని అభాగ్యులు వీరు. వీరి జీవితాలపై ప్రత్యేక కథనం.
కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామీణంలో రేగుల్లంక గ్రామ శివార్లలో నది ఒడ్డున కొన్ని కుటుంబాలు దుర్భరంగా కాలం వెళ్లదీస్తున్నాయి. ఇక్కడ నాలుగైదు కుటుంబాలు ఉంటున్నాయి. నదిలో చేపలు పట్టుకోవడం లేదా గ్రామాల్లో యాచించడం ద్వారా పొట్ట నింపుకుంటున్నారు. తమకు ఇప్పటి వరకు ఆధార్ సహా ఏ గుర్తింపు లేదని, ప్రభుత్వం నుంచి ఒక్క సంక్షేమ పథకం అందలేదని వాపోతున్నారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించినా వారెవరూ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఏపీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఆసుపత్రి