ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''పోలవరం ఖర్చును కేంద్రమే భరిస్తుంది''

పోలవరం ప్రాజెక్టు ఖర్చును రీయింబర్స్ చేయాలంటూ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రత్యేక వినతి అందలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేకావత్ తెలిపారు. ఈ విషయంపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

పోలవరం ఖర్చును కేంద్రమే భరిస్తుంది

By

Published : Jul 8, 2019, 7:40 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి 2017-18 ధరల స్థాయి ఆధారంగా ప్రాజెక్టు ఖర్చును రీయింబర్స్ చేయాలంటూ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రత్యేక వినతి అందలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ స్పష్టం చేశారు. ఈ మేరకు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వకంగా రాజ్యసభకు సమాధానం ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టుకు 2014 నుంచి పూర్తి అయ్యే వరకు 100 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఖర్చును రీయింబర్స్ చేయాలంటూ రాష్ట్రం కోరిందని.. అందులో 2017-18 ధరల ప్రకారం అంటూ ప్రత్యేకంగా కావాలంటూ ఏమీ లేదన్నారు. ఇప్పటివరకు పోలవరానికి కేంద్రం 6 వేల 764 కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్రం అందించిందని.. మిగిలిన నిధుల కోసం ఆడిట్ స్టేట్ మెంట్ ఆఫ్ ఎక్స్​పెండిచర్, 2013-14 ప్రకారం సవరించిన అంచనాలను అందజేయాలని రాష్ట్రానికి సూచించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి నిధులను కేంద్రం విడుదల చేస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

'పోలవరానికి రూ.6 వేల 764 కోట్లు విడుదల చేశాం'

ABOUT THE AUTHOR

...view details