కృష్ణా జిల్లా నందిగామలో ఇసుకను ప్రభుత్వ సైట్ నుంచి బుక్ చేసుకొని... అధిక ధరలకు ఇసుక అమ్ముతున్నారు. రాత్రిపూట తెలియని వ్యక్తుల సమచారాలతో ఇసుకను బుక్ చేస్తూ... కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. నెట్ సెంటర్‌లో ఇసుకను ముందగానే బుక్ చేసి... మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ... ప్రభుత్వ వెబ్సైట్లో ఇసుక నోస్టాక్ రావడంతో... అనుమానం వచ్చి దృష్టి సారించారు. 9టన్నుల ఇసుక ప్రభుత్వ ధర రూ.3300లు ఉండగా... రూ.1000ల ఎక్కువ చేసి అమ్ముతున్న వ్యక్తులు కంచేటి నరేష్, గోపిని పోలీసులు అరెస్టు చేశారు.
కొరతే అదునుగా... ఇసుక దోపిడీకి స్కెచ్ - నందిగామలో ఇసుక దొంగల వార్తలు
ఇసుక కొరతను అదునుగా చేసుకొని... అక్రమ సంపాదనకు నెట్ సెంటర్ నిర్వహాకులు కొత్త అవతారం ఎత్తారు. ఇసుక బిల్లులను ముందుగానే బుక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను నందిగామ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు అదుపులో నిందితులు