రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ఉద్వేగాలు కొనసాగుతునే ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు చల్లబడలేదు. అలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కృష్ణా జిల్లాఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలమేరకు గుడివాడలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, డివిజన్ పోలీసులు కలిసి పట్టణంలోని అన్ని వీధులలో కవాతు చేశారు. మతపరమైన లేక రాజకీయపరమైన దాడులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామనీ.. ముందుస్తు హెచ్చరికగా కవాతు చేపట్టామని చెప్పారు సీఐ అబ్దుల్ నబీ
రాపిడ్ యాక్షన్ బృందం.. శాంతి భద్రతల అదుపుకోసమే.... - krishna
ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రజల్లో భరోసా కల్పించేందుకు రాపిడ్ యాక్షన్ పోలీసులు కవాతు చేస్తుంటారు. అలాంటిది ఎన్నికలై నెలలు గడుస్తున్నా... ఇంకా ఆ వాతావరణం సద్దుమణగని ప్రాంతాల్లో కవాతు చేశారు సైనికులు...
విజయవాడలో పోలీసుల కవాతు