pawan fans: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పవన్..
09:49 September 29
pawan fans
జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan).. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. జనసేనాని పవన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులను ఎయిర్‌పోర్టు(gannavaram airport) వద్ పోలీసులు(Police intercept Pawan kalyan fans) అడ్డుకున్నారు. జనసేన పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి వస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన రోడ్డు మార్గంలో మంగళగిరి వెళ్లనున్నారు. విమానాశ్రయం వద్ద అభిమానులకు పోలీసులు అనుమతి(Police intercept Pawan kalyan fans) నిరాకరించారు. జాతీయ రహదారిపైనే అడ్డుకున్నారు. విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనఖీ చేస్తున్నారు.
ఇటీవల రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కల్యాణ్(pawan kalyan comments on cinema industry) కీలక వ్యాఖ్యలు, వైకాపా ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా మంత్రులు, పవన్ పరస్పర విమర్శల దృష్ట్యా పవన్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించకుంది.
ఇదీ చదవండి..
JANASENA PARTY MEETING: రాష్ట్రంలోని సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన సమావేశం