కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో ఓ గర్భిణికి సహాయం చేసి మైలవరం పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన గర్భిణి.. తన తల్లితో కలసి రోడ్డుపై నడవడానికి ఇబ్బంది పడుతుండగా పోలీసులు గమనించారు. ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తమ వాహనంలోకి ఎక్కించుకుని గమ్యస్థానానికి చేర్చారు. నడవలేని స్థితిలో ఉన్న గర్భిణికి సహాయం చేసిన ఎస్సై రాంబాబును స్థానికులు అభినందించారు.
ఇదీ చదవండి: