కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న 2 కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసులు రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి.. నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్ కి చెందిన సాహిల్ బొర్డియాగా గుర్తించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గన్నవరం సీఐ కోమకుల శివాజీ తెలిపారు.
రెండు కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్ - Gold jewelery seized in Ungujuru
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల బంగారు ఆభరణాలను కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగలకు సంబంధించి సరైన పత్రాలు చూపక పోవటంతో స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
బంగారు ఆభరణాలు స్వాధీనం