యువతిపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరు యువకులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. బాధిత యువతి, ఆమె స్నేహితుడు విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారని, వారు మరో స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా గన్నవరం ముస్తాబాద్ వద్ద ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి ఆమెపై అత్యాచారానికి యత్నించారని ఎస్పీ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గన్నవరం పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి బాధిత యువతిని కాపాడారని ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
అత్యాచారానికి యత్నించిన ఇద్దరి అరెస్టు.. - అరెస్టు
మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడే వారిపై ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా హెచ్చరించారు. గన్నవరం ముస్తాబాద్ వద్ద స్నేహితునితో కలిసి వెళ్తున్న యువతిపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు.
నిందితులపై గతంలోనే రౌడీ షీట్ ఓపెన్ అయ్యి ఉందని.. వీరిని కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చూస్తామన్నారు. సవారిగూడెం - ముస్తాబాద్ రోడ్డు వెంట తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఔట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి పూట ఆ ప్రాంతంలో ఏఆర్ బృందాలు, గస్తీ బృందాలతో నిరంతరం గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల క్రితం కీసరపల్లి వద్ద మైనర్ బాలికపై జరిగిన అత్యాచారయత్నం ఘటనలో, ముస్తాబాద్ వద్ద యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటనలో సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానిక యువకులను ఎస్పీ జాషువా అభినందించారు.
ఇవీ చదవండి: