.
స్థానిక సంస్థల ఎన్నికల విధానంపై సుప్రీంలో పిటిషన్లు
రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లోని రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా 59.85 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని పిటిషనర్లు వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 179.. సుప్రీం తీర్పును ధిక్కరించినట్టే అవుతుంది కాబట్టి వెంటనే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను.... జనాభా లెక్కల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల విధానంపై సుప్రీంలో పిటిషన్లు