పాము కాటుకు గురై ఓ వ్యక్తి ప్రాణాలు విడిచిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక బాబునగర్కు చెందిన తుమ్మలపల్లి రాములు (66) ఓ మర్రి చెట్టు కింద కూర్చొని ఉండగా శనివారం నాడు విష సర్పము కాటువేసింది. అతన్ని హుటాహుటిన పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి విజయవాడ ఆస్పత్రికి తరలించారు. రాములు వైద్యం పొందుతూ ఇవాళ మృతి చెందారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పాము కాటుకు గురై వృద్ధుడు మృతి
నూజివీడులో విషాదం నెలకొంది. విషసర్పం కాటుకు ఓ మరో ప్రాణం బలైంది. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో రెండు నెలల్లో 28 మంది పాముకాట్లకు గురయ్యారు.
పాము కాటు
రెండు నెలల్లో 28 పాముకాట్లు కేసులు నమోదు
గడిచిన రెండు నెలల కాలంలో నూజివీడు పరిసర ప్రాంతాల్లో పాముకాటుతో 28 మంది అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని... పాముకాటులు సంభవిస్తే భయానికి గురి కాకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.