కృష్ణాజిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... యనమలకుదురుకు చెందిన షఫియుద్దీన్ మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం తెల్లవారు జామున షఫియుద్దీన్ ఫోన్ నుంచి అతని కుమారునికి ఓ అగంతుకుడు కాల్ చేశాడు. మీ నాన్న మా దగ్గర ఉన్నాడు..2 లక్షల రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా..సెల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
పెనమలూరులో వ్యక్తి అదృశ్యం...2లక్షలు డిమాండ్ - పెనమలూరులో వ్యక్తి అదృశ్యం....2లక్షలు డిమాండ్
కృష్ణాజిల్లా పెనమలూరులో ఓ వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది. పోలీసులు వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పెనమలూరులో వ్యక్తి అదృశ్యం....2లక్షలు డిమాండ్