సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమిని తట్టుకోలేక ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చల్లపల్లి మండలం నడకుదురు గ్రామానికి చెందిన పీతా మధుసూదనరావు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను తెదేపా వీరాభిమాని. ఈనెల 23న వెలువడిన ఎన్నికల ఫలితాలు చూసి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మరుసటి రోజు గుండెపోటు వచ్చి విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ నేడు మృతిచెందాడు.
తెదేపా ఓటమిని తట్టుకోలేక వ్యక్తి మృతి - కృష్ణా
తెదేపా ఓటమిని తట్టుకోలేక కృష్ణా జిల్లా నడకుదురుకు చెందిన మధుసూదనరావు అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాలేకపోతున్నారనే విషయాన్ని జీర్ణించులేక మృతిచెందాడు.
తెదేపా ఓటమిని తట్టుకోలేక వ్యక్తి మృతి