ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వడదెబ్బ తగిలి.. మంచి నీటి ట్యాంకర్ డ్రైవర్​ మృతి - వడదెబ్బ

మచిలీపట్నం మండలం గుండుపాలెంలో వడదెబ్బ తగిలి ఓ వ్యక్తి మరణించాడు. ట్యాంకర్​తో పరిసర గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేసే ఆ వ్యక్తి.. విధి నిర్వహణలో ఉండగా ఈ ఘటన జరిగింది.

వడదెబ్బ తగిలి మంచి నీటి ట్యాంకర్ డ్రైవర్​ మృతి

By

Published : Jun 6, 2019, 8:00 PM IST

వడదెబ్బ తగిలి మంచి నీటి ట్యాంకర్ డ్రైవర్​ మృతి

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం గుండుపాలెంలో వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందాడు. గుండుపాలెం పరిసర గ్రామాలకు మంచినీటి సరఫరా చేసే ట్యాంకర్ డ్రైవర్​గా పనిచేస్తోన్న నరసింహారావు(40).. ఇవాళ మధ్యాహ్నం నీటిని సరఫరా చేస్తున్న క్రమంలో.. వడదెబ్బకు గురయ్యాడు. ఎండ తీవ్రత భరించలేక.. ట్రాక్టర్ పైనే కుప్పకులాడు. ఈ క్రమంలోనే గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details