ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్పందన' బాగుందీ కానీ... రశీదులివ్వడం లేదు... - spandana program

ప్రజాసమస్యల పరిష్కారానికై రూపొందించిన స్పందన కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఇళ్ల స్థలాల అర్జీలతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజుల బారులు తీరారు. ఇళ్ల స్థలాల అర్జీలకు రశీదులు ఇవ్వడం లేదని చెబుతున్నార అర్జీదారులు.

spandana program

By

Published : Aug 26, 2019, 2:47 PM IST

'స్పందన' కార్యక్రమానికి పోటెత్తిన జనం

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి జనం పోటెత్తారు. ప్రతి సోమవారంలానే ఇవాళా 'స్పందన'లో ఇళ్ల స్థలాల అర్జీలతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద జనం బారులు తీరారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు ఇళ్ల వద్దే వాలంటీర్లు అన్ని రకాల దరఖాస్తులు స్వీకరిస్తారని..., కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించినా... ప్రజలు మాత్రం తమ సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో స్పందనలో అర్జీలిచ్చేందుకు క్యూకట్టారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన కలెక్టర్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనలో 90శాతం అర్జీలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నవే. ఇళ్ల స్థలాల అర్జీలైతే తీసుకుంటున్నారు గానీ... ఎప్పటికి పరిష్కరిస్తారో తెలిపేలా ఎలాంటి రసీదులు ఇవ్వడంలేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details