ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదకరంగా ఇసుక గుంతలు.. చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు - illegal sand digging news

కృష్ణాజిల్లా మున్నేరునదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు నదీ పరివాహక గ్రామాల ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. నిబంధనలను అతిక్రమిస్తూ విచ్చలవిడిగా తవ్వుతుండడంతో అమాయకులు బలవుతున్నారు. తవ్వకాల కారణంగా ఏర్పడిన గుంతల్లో ప్రమాదవశాత్తు పడి మరణిస్తున్నారు.

illegal sand digging
అక్రమ ఇసుక తవ్వకాలు

By

Published : Nov 3, 2020, 2:19 PM IST

కృష్ణాజిల్లా మున్నేరునదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మృత్యువుగా మారుతున్నాయి. పోలంపల్లి, ఆలూరుపాడు, శనగపాడు గ్రామాల్లో ప్రభుత్వ అధికారిక క్వారీలు నడుస్తున్నాయి. ఇవి కాకుండా పెనుగంచిప్రోలు మండలంలో పలు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఒక్కోచోట 10 నుంచి 15 అడుగుల మేర ఇసుకను తవ్వడం వల్ల భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ గుంతల్లో పడి నెల రోజుల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

ఆలూరుపాడు వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన రైతు గుంతలో పడి మృతి చెందాడు. శనగపాడు క్వారీలో పడి ఓ విద్యార్థి మరణించాడు. ఇబ్రహీంపట్నం మండలంలో తీరప్రాంతాల్లో జూపూడి, మూలపాడు, కొటికలపూడి గ్రామాల పరిధిలో నలుగురు రైతులు గుంతల్లో నిండిఉన్న నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. ఇసుక క్వారీలను పరిశీలించి నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details