ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శాంతిస్తున్న కృష్ణమ్మ..తగ్గుముఖం పట్టిన వరద - ప్రకాశం బ్యారేజ్

కృష్ణానదికి వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది... శ్రీశైలం, నాగర్జున సాగర్ జలశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. వరద నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయటంతో లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

శాంతిస్తున్న కృష్ణమ్మ

By

Published : Aug 17, 2019, 3:44 PM IST

శాంతిస్తున్న కృష్ణమ్మ

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగాకొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 6 లక్షల 35 వేల క్యూసెక్కుల నీరు సాగర్​కు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 7 లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు ఉండగా..ఔట్ ఫ్లో 7లక్షల 48 వేల క్యూసెక్కుల మేర ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.50 అడుగుల నీటిమట్టం ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31వేల 349 క్యూసెక్కులు విడుదలైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు విడుదల చేయగా.. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 40 వేల క్యూసెక్కులు విడుదలయ్యింది.

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇన్ ఫ్లో 7లక్షల 57 వేల క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 7లక్షల 92 వేల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 4టీఎంసీల వరద నీరు ఉండగా.. పూర్తి నీటి నిల్వ 3.07 టీఎంసీలు ఉన్నది. బ్యారేజీ 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీరు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details