Gidugu comments on CM : సమస్యల్లో ఉన్న రైతాంగాన్ని పట్టించుకోని ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టిన దాఖలాలు చరిత్రలో లేవని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాండౌస్ తుఫాను దాటికి కృష్ణాజిల్లా మొవ్వ మండలం మొవ్వలోని ముంపునకు గురైన పంట పొలాలను గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. తుఫాను ప్రభావంతో నీట మునిగి మొలకలు వచ్చిన వరి పంటను కాంగ్రెస్ నేతలకు రైతులు చూపించారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు.
'నష్టపోయిన రైతులను సీఎం పట్టించుకోవడం లేదు' - Farmers affected by Cyclone Mandaus
Gidugu comments on CM: మాండౌస్ తుఫాను వలన నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. తుఫాను ప్రభావంతో నీట మునిగిన పంటను కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. తక్షణ సాయం కింద లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాండౌస్ తుఫాను వలన నష్టపోయిన రైతులు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేలిపల్లి ప్యాలెస్ లో విందులు, వినోదాలకే పరిమితం అయ్యారని, రైతుల సమస్యలను పట్టించుకోవాలనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు తక్కువ దూరంలో ఉన్న గుంటూరు, కృష్ణాజిల్లాలో రైతాంగం దయనీయమైన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని, నష్టపోయిన ప్రతి రైతుకు లక్ష రూపాయలు తక్షణ సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయాలని రుద్రరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :