హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇవాళ కృష్ణా జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. డోకిపర్రు గ్రామంలో వేంచేసిన శ్రీభూసమేత వేంకటేశ్వరస్వామిని ఆయనతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు.
వారికి మెగా కృష్ణారెడ్డి దంపతులు, అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం... వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పవన్ పరిశీలించనున్నారు.